ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'వృషభ' ను ప్రకటించిన మోహన్ లాల్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 13, 2023, 07:15 PM

నంద కిషోర్ దర్శకత్వంలో మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'వృషభ' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజగా ఈరోజు ఉదయం విడుదల చేసిన ప్రకటన వీడియోలో మోహన్‌లాల్ మాట్లాడుతూ.... ఈ సినిమా స్టార్ హీరోకి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని తెలిపారు. ఈ సినిమాలో భావోద్వేగాలు మరియు VFX ఎక్కువగా ఉంటుంది అని ప్రేమ వర్సెస్ రివెంజ్ అనే రెండు భావోద్వేగాల మధ్య జరిగే సంఘర్షణ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది అని సమాచారం. జూలై 9 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అభిషేక్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని మరియు జుహీ పరేఖ్ మెహతా ఈ సినిమాని నిర్మించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa