చాలా కాలం తర్వాత రవిబాబు తెరకెక్కించిన చిత్రం అసలు. పూర్ణ, రవిబాబు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై ఈ సినిమాను రవిబాబు నిర్మించారు. ఉదయ్, సురేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రవిబాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఏప్రిల్ 13 నుంచి ఈటీవీ విన్ యాప్ అవుతున్నట్లుగా చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా అర్ధరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.