బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను ఈ నెల 30న చంపేస్తామంటూ ముంబై పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చింది. సోమవారం రాత్రి ముంబై ప్రధాన కంట్రోల్ రూంకి కాల్ చేసిన దుండగుడు ఈ నెల 30న సల్మాన్ ఖాన్ ను చంపేస్తానని, ఈ విషయాన్ని సల్మాన్ కు చెప్పాలని కోరాడు. దీంతో పోలీసులు సాంకేతిక సహాయంతో ఠాణె జిల్లా పాషాపూర్ నుండి ఫోన్ చేసిన 16 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. అతడి ఫోన్ ను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు.