ప్రముఖ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం తెరకెక్కిన 'బలగం' చిత్రం ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా తాజాగా వివాదంలో చిక్కుకుంది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మండల ఎంపీటీసీలు 'బలగం' చిత్రంపై ఫిర్యాదు చేశారు. చిత్రంలో ఎంపిటీసిలను కించపరిచే విధంగా మాట్లాడిన సన్నివేశాలు బాధపెట్టాయని, ఆ సన్నివేశాలను సినిమా నుండి తొలగించాలని ఫిర్యాదు చేశారు.