హీరో విశాల్‌కి మద్రాస్ హైకోర్ట్ షాకిచ్చింది. విశాల్ లైకా సంస్థతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఆ కంపెనీ కోర్టును ఆశ్రయించగా సెషన్స్ కోర్టు రిజిస్ట్రార్ పేరుతో రూ.15 కోట్లను 3 వారాల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. దీనిపై విశాల్ హైకోర్టును ఆశ్రయించగా, సింగిల్ స్పెషల్ కోర్టు ఉత్తర్వులనే ధర్మాసనం సమర్థించింది. ప్రత్యేక జడ్జి తుది తీర్పును వెలువరించేంత వరకు విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై నిర్మించే సినిమాలను థియేటర్ లేదా ఓటీటీలో విడుదల చేయడానికి వీల్లేదని ఆదేశించింది.