జిత్తు మాధవన్ దర్శకత్వంలో శౌబిన్ షాహిర్, అర్జున్ అశోకన్, చెంబన్ వినోద్ జోస్ మరియు అనంతరామన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం 'రోమంచం' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకోగా ఈ సినిమా ఏప్రిల్ 7న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో OTT ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది.
ఈ హార్రర్ కామెడీ చిత్రం బెంగుళూరులో స్పిరిట్ బోర్డుని ఉపయోగించిన ఏడుగురు బ్యాచిలర్లకు జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. జాన్‌పాల్ జార్జ్, సౌభిన్ షాహిర్, గిరీష్ గంగాధరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa