జూనియర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో యష్ రాజ్ ఫిలిమ్స్‌కి చెందిన వార్ సినిమా సీక్వెల్ వార్ 2 తెరకెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాని బ్రహ్మాస్త్ర సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.