రాజకీయాల్లోకి వచ్చాకా తట్టుకోగలమా? అని సినీ నిర్మాత దిల్ రాజు మీడియాతో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన రాజకీయ రంగ ప్రవేశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లోకి రమ్మని చాలా మంది ఆహ్వానిస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను క్రియాశీల రాజకీయాలకు సిద్ధంగా ఉన్నానని అనుకోవడం లేదని, సినిమాలతో సంతోషంగా ఉన్నానని దిల్ రాజు తేల్చి చెప్పారు. అయితే ఇప్పటివరకు తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పకపోవడం గమనార్హం.