ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా 'పుష్ప'. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో రష్మికా మండన్న హీరోయినిగా నటించింది. ఈ సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వల్ గా 'పుష్ప 2' మూవీ రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 8న స్టార్ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 'పుష్ప 2' సినిమా టీజర్‌ని రిలీజ్ చేయనున్నారు చిత్రబృందం.అయితే తాజాగా ఏప్రిల్ 5 ఉదయం 11:07 గంటలకు దాని కంటే ముందుగానే అప్‌డేట్ ఇస్తామని చిత్రబృందం ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa