ప్రముఖ తమిళ దర్శకుడు AL విజయ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అరుణ్ విజయ్ ఒక సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి మిషన్: చాప్టర్ 1 అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. మిషన్: చాప్టర్ 1 డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ కోలీవుడ్ ప్రొడక్షన్ కమ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. లైకా అధినేత సుభాస్కరన్ ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ సహా నాలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటి నిమిషా సజయన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. మిషన్: చాప్టర్ 1ని ఎం రాజశేఖర్ మరియు ఎస్ స్వాతి సంయుక్తంగా నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa