నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన మొదటి మహిళా-సెంట్రిక్ చిత్రానికి సైన్ చేసిన సంగతి అందరికి తెలిసందే. బ్రీజీ రొమాంటిక్ ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్‌లో అధికారికంగా ప్రారంభమైంది. నూతన దర్శకుడు శాంతరూబన్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'రెయిన్‌బో' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో దేవ్ మోహన్ కథానాయకుడిగా నటిస్తున్నారు.
ఈరోజు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ గ్లాస్ హౌస్‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అల్లు అరవింద్, సురేష్ బాబు, అమల అక్కినేని, సుప్రియ, వెంకీ కుడుముల తదితరులు హాజరయ్యారు. అమల అక్కినేని మొదటి క్లాప్ కొట్టగా, అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, సురేష్ బాబు స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు.
ఈ చిత్రం ఏప్రిల్ 7, 2023న ప్రధాన ఫోటోగ్రఫీని కిక్‌స్టార్ట్ చేస్తుంది. SR ప్రకాష్ బాబు మరియు SR ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్తానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa