దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య బాబుతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఓ పాట గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను రూ.5 కోట్లతో చిత్రీకరిస్తున్నారు చిత్ర బృందం.గణేశుడిపై నేపథ్యంలో సాగే ఈ పాట కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ ను సిద్ధం చేశారు. బాలయ్య, శ్రీలీల ఈ పాటను సెట్స్‌పై చాలా గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే, బాలయ్య విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ని తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa