టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఆరంజ్' సినిమా చరణ్ బర్త్ డే స్పెషల్ సందర్భంగా మార్చి 25, 2023న ఈ సినిమా రి రిలీజ్ గా విడుదలైంది. తొలివిడుదలలో భారీ డిజాస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం రీరిలీజ్‌లో అద్భుతమైన కలెక్షన్లతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటి వరకు ఈ సినిమా మూడు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఆస్ట్రేలియాలో ప్రదర్శించబడింది. అక్కడ విడుదలైన మొదటి రోజున 8K డాలర్లకు పైగా వసూలు చేయగా ఈ విషయం పై చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన జెనీలియా జోడిగా నటించింది. షాజన్ పదంసీ, ప్రభు, ప్రకాష్ రాజ్, మంజుల, బ్రహ్మానందం, సంజయ్ స్వరూప్ కీలక పాత్రలు పోషించారు. నాగబాబు నిర్మించిన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa