ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో 'పుష్ప 2' అప్‌డేట్‌

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 01, 2023, 05:08 PM

పుష్ప: ది రైజ్ చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సృష్టించిన మాస్ హిస్టీరియా గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 350 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తాజాగా ఇప్పుడు దేశం మొత్తం పుష్ప: ది రూల్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో, మూవీ టీమ్ అప్‌డేట్‌స్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. మ‌రి టీమ్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వ‌బోతుందో చూడాలి.

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, సునీల్, రావు రమేష్, జగదీష్ ప్రతాప్, ధనంజయ, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa