మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా బిగ్ బడ్జెట్ మూవీ "దసరా" మార్చి 30న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో దసరా నవరాత్రి పేరిట పాన్ ఇండియా వ్యాప్తంగా గ్రాండ్ ప్రమోషనల్ టూర్ జరుగుతుంది. ఈ మేరకు నిన్న నాగ్ పుర లో సందడి చేసిన నాని, ఈ రోజు అహ్మదాబాద్ లో హల్చల్ చేసారు. అక్కడ ప్రింట్ మీడియా, ఫ్యాన్స్ మీటింగ్.. ఇలా క్షణం తీరిక లేకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పోతే, రేపు జైపూర్ లో దసరా నవరాత్రి సెలెబ్రేషన్స్ లో నాని పాల్గొననున్నారు.
శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకుడు కాగా, నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa