యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నుండి వచ్చిన సరికొత్త చిత్రం "దాస్ కా ధమ్కీ". ఉగాది కానుకగా బుధవారం విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ధమ్కీ ధమఖేదర్ వసూళ్లను రాబడుతుంది.
ధమ్కీ గ్రాండ్ సక్సెస్ కావడంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ పేరిట ఈ రోజు విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, వైజాగ్లలో విశ్వక్ సేన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం విజయవాడకు చేరుకున్న విశ్వక్, వెంటనే ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుని, అమ్మ ఆశీస్సులను అందుకున్నారు. ఆపై జైరాం థియేటర్లో ఆడియన్స్ తో కలిసి నూన్ షోలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa