ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నటుడి కొత్త చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2023, 03:01 PM

చిన్న పాపిశెట్టి దర్శకత్వంలో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా హీరో సుధాకర్ కోమాకుల ఒక సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఈరోజు ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి 'నారాయణ అండ్ కో' అనే ఆసక్తికరమైన టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు.


ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ ఆమని, దేవి ప్రసాద్, జై కృష్ణ, పూజ కిరణ్, ఆరతి పొడి, యామిని బి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది మరియు మూవీ మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.


సురేష్ బొబ్బిలి, డాక్టర్ జోస్యభట్ల, నాగ వంశీ త్రయం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ అందించారు. నటనతో పాటు, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్ మరియు సుఖ మీడియా బ్యానర్లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa