క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం "రావణాసుర". అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దక్షా నాగర్కర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్ కీరోల్ లో నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, RT టీం వర్క్స్ బ్యానర్ పై అభిషేక్ నామ, రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా సమాచారం ప్రకారం, రావణాసుర ఓవర్సీస్ హక్కులను ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫార్స్ ఫిలిమ్స్ కో LLC సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఏప్రిల్ 6నుండి USA ప్రీమియర్స్ జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa