ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్లో సందడి చేస్తున్న "బలగం"

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2023, 02:26 PM

రీసెంట్గా విడుదలైన సినిమాలలో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం "బలగం". కమెడియన్ వేణు ఎలదండి దర్శకత్వంలో ఫీల్ గుడ్ ఎమోషనల్ విలేజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీ డిజిటల్ రంగంలో సందడి చెయ్యడం షురూ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నిన్న అర్ధరాత్రి నుండి తెలుగుతో పాటుగా తమిళం, మలయాళ భాషలలో బలగం డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో గ్రాండ్ సక్సెస్ ఐన ఈ సినిమా డిజిటల్లో ఏమేరకు విజయం సాధిస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa