విశ్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం చేసిన "దాస్ కా ధమ్కీ" చిత్రం ఉగాది కానుకగా ధియేటర్లకొచ్చి, బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. విశ్వక్ కెరీర్లో ఆల్ టైం హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్లను వసూలు చేసిన ఈ సినిమా యొక్క విజయాన్ని ఆడియన్స్ తో సెలెబ్రేట్ చేసుకునేందుకు చిత్రబృందం బ్లాక్బస్టర్ సక్సెస్ టూర్ పేరిట పోస్ట్ థియేట్రికల్ ప్రమోషన్స్ ను నిర్వహించబోతుంది.
ఈ సక్సెస్ టూర్లో భాగంగా ఈ రోజు విశ్వక్ సేన్ విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, వైజాగ్ లలో హల్చల్ చెయ్యనున్నారు. ఈ మేరకు ఆల్రెడీ కొంతసేపటి క్రితమే విశ్వక్ విజయవాడ చేరుకున్నారు. ముందుగా దుర్గమ్మను దర్శించుకుని, ఆపై జైరాం థియేటర్లలో ఆడియన్స్ తో కలిసి నూన్ షోలో పాల్గొననున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa