బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ షూటింగ్ సెట్ లో గాయపడ్డారు. ‘బడే మియా చోటే మియా’ చిత్ర షూటింగ్ స్కాట్ లాండ్ లో జరుగుతుండగా మరో హీరో టైగర్ ష్రాఫ్ తో కలిసి స్టంట్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్షయ్ మోకాలికి గాయమైంది. ఆయనకు చికిత్స అందించిన వైద్యులు కొద్దిరోజులు యాక్షన్ సన్నివేశాలకు దూరంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే, అక్షయ్ మిగతా షూటింగ్ లో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa