సినీపరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కన్నుమూశారు. గత కొంత కాలంగా డయాలసిస్ వల్ల అనారోగ్యంతో బాధపడుతున్న ప్రదీప్ సర్కార్ (68) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు శాంతాక్రజ్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ప్రదీప్ మరణంపై బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.