యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం టాలీవుడ్ లో స్పీడ్ పెంచుతున్నాడు. ఈ ఏడాది వినరో భాగ్యము విష్ణుకథ చిత్రంతో ఫస్ట్ సూపర్ హిట్ కొట్టిన కిరణ్ వచ్చే నెల్లో మీటర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
రమేష్ కదూరి దర్శకత్వంలో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కాబోతుంది. విడుదల తేదికి మరో 2వారాల సమయం మాత్రమే ఉండడంతో మీటర్ చిత్రబృందం ప్రచార కార్యక్రమాల వేగాన్ని ముమ్మరం చేస్తుంది. ఈ మేరకు రేపు రాజమండ్రి, తణుకు, తాడేపల్లి గూడెం, విజయవాడలలో మీటర్ చిత్రబృందం హల్చల్ చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa