యంగ్ హీరో విశ్వక్ సేన్ డైరెక్ట్ చేసి, హీరోగా కూడా నటించిన చిత్రం "ధమ్కీ". ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఔటండౌట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఉగాది కానుకగా నిన్ననే విడుదలయ్యింది. విడుదలకు ముందు నుండి ఆడియన్స్ లో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఉండగా, తొలి షో నుండే హిట్ టాక్ సొంతం చేసుకుని హౌస్ ఫుల్ థియేట్రికల్ రన్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ధమ్కీ ధమఖేదర్ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 8.88 కోట్ల కలెక్షన్లతో విశ్వక్ సేన్ కి ఆల్ టైం కెరీర్ హైయెస్ట్ అందించింది ధమ్కీ సినిమా. అలానే USA లో కూడా ఈ సినిమా విశ్వక్ కి కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ (150కే డాలర్స్) ని అందించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa