నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'డెవిల్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ పీరియాడికల్ డ్రామాలో మాళవిక నాయర్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
తాజాగా ఈరోజు ఉగాది సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి స్లిక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో కళ్యాణ్ రామ్ బ్లేజర్ మరియు పంచెకట్టులో హ్యాండిల్ పట్టుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. అభిషేక్ పిక్చర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa