'అమృతం' ఫేమ్ హర్షవర్ధన్ దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం "మామా మశ్చీంద్ర". ఈ సినిమాలో సుధీర్ బాబు త్రిబుల్ రోల్ లో నటిస్తున్నారు. ఇషా రెబ్బ, మిర్నాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. పోస్టర్స్ తో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా యొక్క నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ కోసం ఆడియన్స్ వెయిటింగ్. ఐతే, ఈ రోజు ఉగాది పండుగను పురస్కరించుకుని మేకర్స్ నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ పై అప్డేట్ ఇస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. ఈ మేరకు అతి త్వరలోనే మామా మశ్చీంద్ర టీజర్ విడుదల కాబోతుందని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa