సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస మహారాజ రవితేజ, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న సినిమా "రావణాసుర". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లాతో పాటుగా సుశాంత్, మేఘా ఆకాష్, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ కీరోల్స్ లో నటిస్తున్నారు.
ఈ రోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. రావణాసుర ఫోర్త్ సింగిల్ 'డిక్క దిషుమ్' అనే మాంఛి పార్టీ సాంగ్ ఈ రోజు సాయంత్రం 04:05 నిమిషాలకు విడుదల కాబోతుందని పేర్కొంటూ మేకర్స్ విడుదల చేసిన ఈ పోస్టర్ ద్వారా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలను తెలియచేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa