యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న కొత్త చిత్రం "సామజవరగమన". ఇటీవల విడుదలైన శ్రీవిష్ణు బర్త్ డే గ్లిమ్స్ కి ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో, సినిమాపై మంచి అంచనాలు మొదలయ్యాయి.
ఈ రోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని, చిత్రబృందం స్పెషల్ అప్డేట్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మే 18న సామజవరగమన మూవీ విడుదల కాబోతుందని పేర్కొంటూ, రిలీజ్ డేట్ తో కూడిన స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు.
'వివాహ భోజనంబు' ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకుడు కాగా హాస్య మూవీస్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రాజేష్ దందా నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa