మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'భోళా శంకర్'. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లిగా నటిస్తుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయినిగా నటిస్తుంది. ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా నుండి స్పెషల్ లుక్ కూడా విడుదల చేశారు చిత్రబృందం. ఈ సినిమాని ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా తమిళ 'వేదలమ్' మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్స్ తో కలిసి అనిల్ సుంకర యొక్క ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa