తెలుగులో శౌర్యం, శంఖం, దరువు చిత్రాలను డైరెక్ట్ చేసిన సినిమాటోగ్రాఫర్ కం డైరెక్టర్ సిరుతై శివ తమిళంలో వీరం, వేదాళం, విశ్వాసం వంటి బ్లాక్ బస్టర్స్ ని తెరకెక్కించారు. తాజాగా ఆయన హీరో సూర్యతో ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో సూర్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా సూర్య కెరీర్ లో అతి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని, గతంలో సూర్య నటించిన హై బడ్జెట్ మూవీకి మూడింతలు ఈ మూవీ బడ్జెట్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. దాదాపు 350 కోట్లతో మేకర్స్ ఈ సినిమాను ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నారంట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa