సక్సెస్ ఫుల్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన 'ధమాకా' చిత్రంతో 2022లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ ని అందుకున్నారు. తాజాగా ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్‌తో త్రినాథరావు నక్కిన తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని ఉషా ముల్పూరి, శంకర్ ప్రసాద్ ముల్పూరి నిర్మించనున్నారు.
ఐరా క్రియేషన్స్ యొక్క ఈ ప్రొడక్షన్ నంబర్ 5 దర్శక, నిర్మాతలకు అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కానుంది. ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa