కోలీవుడ్ లో మోస్ట్ యాంబీషియస్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న పొన్నియిన్ సెల్వన్ చిత్రం యొక్క రెండవ భాగం ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది. విడుదల తేదికి సమయం ఆసన్నమవుతుండడంతో, చిత్రబృందం సంగీత ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ పాన్ ఇండియా భాషల్లో విడుదలైంది. తెలుగులో 'ఆగనందే' అని సాగే ..ఈ బ్యూటిఫుల్ మెలోడీని శక్తి శ్రీ గోపాలన్ ఆలపించారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. AR రెహమాన్ స్వరపరిచారు.
మణిరత్నం ఈ సినిమాకు దర్శకుడు కాగా, చియాన్ విక్రం, ఐశ్వర్యా రాయ్, కార్తీ, త్రిష, జయం రవి ప్రధానపాత్రల్లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa