ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలలో కృష్ణవంశీ తెరకెక్కించిన "రంగమార్తాండ" ఒకటి. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా గారు సంగీతం అందించారు. ఇటీవలే టీజర్ ను విడుదల చేసి, ప్రేక్షకుల హృదయాల బరువు పెంచిన రంగమార్తాండ చిత్రబృందం తాజాగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ట్రైలర్ ను విడుదల చెయ్యబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa