ఈ మధ్య టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న సినిమాలలో "బలగం" ఒకటి. వేణు ఎలదండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించిన బలగం మూవీ రోజు రోజుకూ బాక్సాఫీస్ వద్ద బలంగా మారుతూ.. రెండో వారంలో కూడా భీకర కలెక్షన్లను నమోదు చేస్తుంది.
తాజాగా బలగం విజయాన్ని ఉద్దేశిస్తూ, హీరో ప్రియదర్శి కమర్షియల్ సినిమాకు కొత్త అర్థాన్ని ఇచ్చారు. ఏ సినిమా ఐతే ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుందో, విమర్శకుల ప్రశంసలు పొందుతుందో, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతుందో.. అదే కమర్షియల్ సినిమాకు ఆల్టర్నేట్ డెఫినిషన్.. అని పేర్కొన్నారు. బలగం కమర్షియల్ గా ఇంత పెద్ద సక్సెస్ అయ్యిందంటే, అది కేవలం ప్రియాతి పియ్రమైన ప్రేక్షకాభిమానుల వల్లనే. అంటూ ప్రియదర్శి ట్వీట్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa