ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డులతో ఇండియన్ సినిమాకు ఈ ఏడాది శుభారంభం కలిగింది. 95వ అకాడెమీ అవార్డుల కార్యక్రమంలో బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం విభాగంలో "ది ఎలిఫెంట్ విస్పర్ర్స్", బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో "నాటు నాటు" అత్యున్నత ఆస్కార్ పురస్కారాన్ని దక్కించుకుని, గ్లోబల్ లెవెల్లో ఇండియన్ సినిమా సత్తాని చాటాయి. రెండు ఆస్కార్ అవార్డులు ఒకేసారి రావడంతో ఈ ఏడాది ఇండియన్ సినిమా హిస్టరీలో చిరస్థాయిలో నిలిచిపోతుంది.