రాజుమురుగన్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో కార్తీ తన 25వ సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'జపాన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా శివ కార్తికేయన్ మావీరన్ తో పాటుగా జూన్ 29న విడుదల కానున్నట్లు కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ బజ్. ఈ విషయం గురించి త్వరలో మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రానుంది.
ఈ చిత్రంలో కార్తీ సరసన జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది. ఈ సినిమాలో టాలీవుడ్ పాపులర్ కమెడియన్ సునీల్ విలన్‌గా నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలను మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa