'జ్యో అచ్యుతానంద' తదుపరి నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల డైరెక్టోరియల్ లో తెరకెక్కిన చిత్రం "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి". ఈ సినిమాలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించారు. ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా మార్చి 17న అంటే వచ్చే శుక్రవారం థియేటర్లకు రాబోతుంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ మేరకు రేపు సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్ హైటెక్ సిటీలోని ట్రిడెంట్ లో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని, అధికారిక ప్రకటన జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa