ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఇంటింటి రామాయణం' రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2023, 08:55 AM

తెలుగు ఓటిటి ఆహా లో వెబ్ ఫిలింగా తెరకెక్కిన "ఇంటింటి రామాయణం" డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కావలసి ఉండగా, కొన్ని రోజుల తరవాత థియేటర్లలో విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. మరి, ఇటీవల కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో ఈ మూవీ స్పెషల్ ప్రీమియర్స్ కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియకనే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మార్చి 17న అంటే వచ్చే శుక్రవారం ఈ సినిమాను థియేటర్లకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని వినికిడి.


సురేష్ నారెడ్ల డైరెక్షన్లో సీనియర్ నటుడు నరేష్, రాహుల్ రామకృష్ణ, బుల్లితెర నటి నవ్యస్వామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం   ఔటండౌట్ విలేజ్ ఫ్యామిలీ డ్రామా గా రూపొందింది. ఈ సినిమాకు కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. IVY ప్రొడక్షన్స్, మారుతీ టీం, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ ఉప్పటూరి, గోపీచంద్ ఇన్నమూరి నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa