ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తూ ఝూటి మై మక్కార్' ఫస్ట్ డే సాలిడ్ కలెక్షన్లు 

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2023, 09:11 PM

లవ్ రంజన్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన చిత్రం "తూ ఝూటి మై మక్కార్". ఈ సినిమాలో రణ్ బీర్, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ సృష్టించిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పఠాన్ బాక్సాఫీస్ ధాటికి స్టార్ హీరోల సినిమాలు కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్న తరుణంలో ఈ సినిమా ఆడియన్స్, క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూలు అందుకుంటుంది. పఠాన్ ని ఎదుర్కొని బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే రోజున సాలిడ్ కలెక్షన్లను రాబట్టింది. తొలిరోజున 15. 73 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ఇకపై కూడా ఇలాంటి కలెక్షన్లనే రాబట్టేటట్టు కనిపిస్తుంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa