నిజ జీవితంలో బాబాయ్, అబ్బాయ్ లైన వెంకటేష్, రానా తెరపై తండ్రీకొడుకులుగా, నటిస్తున్న వెబ్ సిరీస్ "రానా నాయుడు". అమెరికన్ సిరీస్ 'రే డోనోవన్' కు ఇండియన్ అడాప్షన్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ రేపటి నుండే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రాబోతుంది. ఫస్ట్ టైం వెంకటేష్, రానా కలిసి నటించడం అదికూడా ఒకరంటే మరొకరికి పడని పాత్రల్లో నటిస్తుండడంతో, ఆడియన్స్ లో ఈ వెబ్ సిరీస్ పై మంచి అంచనాలున్నాయి.
సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ప్రియా బెనర్జీ, ఆశిష్ విద్యార్ధి తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa