నటసింహం నందమూరి బాలకృష్ణ, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా కలిసి నటించిన రెండవ చిత్రం "సింహా". బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకుడు. స్నేహా ఉల్లాల్, నమిత, రెహమాన్, సాయి కుమార్, KR విజయ, ఆదిత్య మీనన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు చక్రి సంగీతం అందించారు.
పోతే, ఈ మూవీ ఈనెల 11వ తేదీన రీ రిలీజ్ కాబోతున్న విషయం గురించి తెలిసిందే కదా. రీ రిలీజ్ కి ఇంకా రెండ్రోజుల సమయం మాత్రమే ఉండడంతో, అభిమానుల్లో ఉత్సాహకర వాతావరణం నెలకొంది. మరోసారి, ఈ మాస్ బ్లాక్ బస్టర్ ని థియేటర్లలో చూసేందుకు ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa