కొంతసేపటి క్రితమే దసరా సినిమా నుండి థర్డ్ సింగిల్ తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలయ్యింది. తెలుగులో 'చమ్కీల అంగీలేసి' అని సాగే ఈ పాటను సింగర్స్ రామ్ మిర్యాల, ధీ ఆలపించారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. సంతోష్ నారాయణ్ అందించిన బాణీలు ఖచ్చితంగా ఈ పాటను ఛార్ట్ బస్టర్ గా చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈనెల 30వ తేదీన దసరా పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa