యువ కథానాయకుడు కార్తికేయ, 'డీజే' భామ నేహశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "బెదురులంక 2012". ఈ సినిమా నుండి కొంతసేపటి క్రితమే ఫస్ట్ సింగిల్ 'వెన్నెల్లో ఆడపిల్ల' లిరికల్ వీడియో విడుదలయ్యింది. మణిశర్మ స్వరపరచిన ఈ మ్యాజికల్ మెలోడీని హారికా నారాయణ్, సుధాన్షు జేవీ ఆలపించారు. కిట్టు విస్సప్రగడ సాహిత్యం అందించారు.
లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాణంలో, దర్శకుడు క్లాక్స్ తెరకెక్కిస్తున్న ఈ డ్రామెడి ఎంటర్టైనర్ యొక్క టీజర్ కు ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa