యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరస సినిమాలతో ప్రేక్షకులకు నిత్యం టచ్ లోనే ఉంటున్నాడు. ఈ మధ్యనే ఆయన నటించిన వినరో భాగ్యము విష్ణుకథ చిత్రం థియేటర్లకు వచ్చి, ప్రేక్షకులను విశేషంగా అలరించింది. నిన్న మొన్నటి వరకు ఆ మూవీ ప్రమోషన్స్ నిమిత్తం తీవ్రంగా కష్టపడిన కిరణ్ తాజాగా ఇప్పుడు తన కొత్త సినిమా "మీటర్" కోసం మరోసారి ముమ్మర ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారు. మీటర్ ప్రచార కార్యక్రమాలను చిత్రబృందం టీజర్ తో షురూ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి హైదరాబాద్ AMB సినిమాస్ స్క్రీన్ 6 లో జరగబోయే ఈవెంట్ లో సాయంత్రం 04:05 నిమిషాలకు మీటర్ టీజర్ లాంచ్ కాబోతుంది. మరి, టీజర్ కి సంబంధించిన చిన్న గ్లిమ్స్ ను మేకర్స్ నిన్న విడుదల చేసి, ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa