'దుర్గ' అనే బరువైన పాత్రలో కనబడి అవాక్కయ్యేలా చేసిన, 'పరశురామ్' గా నెరిసిన జుట్టు, గడ్డంతో సూపర్ స్టైలిష్ గా కనబడిన సుధీర్ బాబు రెండు మేకోవర్లకు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా డీజే లుక్ కూడా వచ్చేసింది. ఈ లుక్ లో పాతికేళ్ల ఛార్మింగ్ యంగ్ గయ్ గా సుధీర్ బాబు కనిపిస్తున్నారు. మూడు విభిన్న పాత్రలు, మూడు వైవిధ్యమైన మేకోవర్లతో 'మామా మశ్చీంద్ర' సినిమాతో సుధీర్ బాబు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. మరి, పోస్టర్స్ తో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా యొక్క నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ కోసం ఆడియన్స్ వెయిటింగ్.
హర్షవర్ధన్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, ఇషా రెబ్బ, మిర్నాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa