నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న "దసరా" పాన్ ఇండియా మూవీ నుండి కొద్దిసేపటి క్రితం థర్డ్ సింగిల్ 'చెమ్కీల అంగీలేసి' ఫోక్ సాంగ్ ప్రోమో విడుదలయ్యింది. చెమ్కీల అంగీలేసి.. ఓ వదినెయ్..చాకు లెక్కుండేటోడే..ఓ వదినెయ్.. కండ్లకు ఐనా బెట్టి.. కత్తోలే కన్నెట్లా కొడుతుండేనే ... అని సింగర్ ధీ పాడుతుంటే, అచ్చతెలుగు జానపద గీతాన్ని విన్న ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. మరి, ఫుల్ సాంగ్ మార్చి 8న విడుదల కాబోతుంది.
ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈనెల 30న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa