వంశీ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. చివరి షెడ్యూల్ నిన్న రాత్రి వైజాగ్‌లో ప్రారంభమైంది. ఈ చివరి షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంతో కూడిన కీలక సన్నివేశాలను మూవీ మేకర్స్ రూపొందించనున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషన్ మెటీరియల్ ఈ సినిమాపై అంచనాలను పెంచింది.
ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కృతి సనన్ సోదరి నుపుర్ సనాన్ అండ్ ప్రముఖ మోడల్ గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించనున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం మూవీ మేకర్స్ 5 ఎకరాల స్థలంలో స్టువర్టుపురం గ్రామాన్ని రూపొందించారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa