టాలీవుడ్ స్టార్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. ఐతే, శర్వా రావడమే హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. చిన్న చిన్న రోల్స్ తో మొదలైన శర్వానంద్ సినీ ప్రయాణం ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ కి చేరుకుంది. మరి, స్వశక్తితో కష్టపడి పైకొచ్చి, వినూత్న కధాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్న శర్వానంద్ ఈ రోజు 39వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రామిసింగ్ హీరోకి ప్రేక్షకాభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
ఐదో తారీఖు, గౌరి, శంకర్ దాదా ఎంబీబీస్, యువసేన, సంక్రాంతి, వెన్నెల, లక్ష్మి సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేసిన శర్వానంద్ అమ్మ చెప్పింది సినిమాతో 2006 లో లీడ్ హీరోగా డిబట్ ఎంట్రీ ఇచ్చారు. ఆపై గమ్యం, ప్రస్థానం, రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు, ఒకే ఒక జీవితం వంటి సక్సెస్ఫుల్ సినిమాలలో హీరోగా నటించారు.