నాచురల్ స్టార్ నాని తన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ "దసరా" ప్రమోషన్స్ నిమిత్తం చెన్నై SRM యూనివర్సిటీ యాన్యువల్ కల్చరల్ ఫస్ట్ కి ఇటీవలే హాజరయ్యారు. అక్కడ స్టూడెంట్స్ తో కలిసి ఆడిపాడారు కూడా. ఈ సందర్భంగా మార్చి 8వ తేదీన విడుదల కాబోతున్న థర్డ్ సింగిల్ 'చెమ్కీల అంగీలేసి' ఫోక్ సాంగ్ యొక్క మొదటి రెండు లైన్లను తన ఫోన్ నుండి స్టూడెంట్స్ కి వినిపించారు. నాని చేసిన ఈ పనితో థర్డ్ సింగిల్ పై అంతటా ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈనెల 30న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa