తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతిశెట్టి జంటగా నటిస్తున్న సినిమా "కస్టడీ". ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా మే 12న తెలుగు, తమిళ భాషల్లో విడుదలయ్యేందుకు సంసిద్ధమవుతోంది.
కాసేపటి క్రితమే మేకర్స్ ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న సీనియర్ హీరో అరవింద్ స్వామి క్యారెక్టర్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. 'రాజు అకా రాజు' అంటూ అరవింద్ స్వామిని ప్రేక్షకులకు పరిచయం చేసారు.
ఈ చిత్రానికి సంగీత ద్వయం ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa